27.6 C
Hyderabad
Wednesday, September 30, 2026

మచ్చర్ల గ్రామంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం – విద్యా సదస్సు…

Must read

📰 Generate e-Paper Clip

ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో విద్యార్థుల ముందు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు…స్థానిక గ్రామ సర్పంచ్ కట్ట మల్లవ్వ-ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరి సభాధ్యక్షత వహించగా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దాదాపు 30 మంది ఉద్యోగులు హాజరైనారు.గ్రామ ఆత్మీయ ప్రముఖులు గుమ్మడి విట్టల్,ఆరె జగదీశ్వర్,డాక్టర్ మనోహర్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పండరి, కార్యక్రమ నిర్వాహకులు గ్రామ ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం సాధించే దిశగా ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు.హాజరైన 30 మంది ఉద్యోగులు మా ఆహ్వానాన్ని మన్నించి ఆదివారం సెలవు దినమైనా ఎన్ని అత్యవసర పనులున్నా పక్కనపెట్టి వేరు వేరు డిపార్ట్మెంట్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ తాము ఉద్యోగాల కొరకు కష్టపడిన తీరును సాధించిన పరిస్థితిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

గ్రామ ఉద్యోగులు,మహిళా ఉద్యోగినులు భూపతి,జాన్ వెస్లీ,సంతోష్ యాదవ్,రాజేందర్,లింగం,సౌందర్య శ్రీనిత మాట్లాడుతూ మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే 1 తరగతి నుండి 10 తరగతి వరకు ఇక్కడే చదివామని ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంతవారి మైనామన్నారు.టీచర్లు చెప్పిన పాఠాలు చక్కగా చదివి,సహపాఠ్య ప్రణాళికలలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.విషయాన్ని కూలంకషంగా గమనిస్తూ పరిశీలిస్తూ పరిశోధించాలని,సబ్జెక్టుపై మక్కువ పెంచుకొని, మెలకువలు నేర్చుకోవాలన్నారు.పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిరంతరం చదివితే తెలువని విషయాలు తెలుస్తాయన్నారు. మనకు ఇష్టమైన సబ్జెక్టు ఎంచుకొని ఉపాధ్యాయుల సలహాలు,సూచనలతో ముందుకెళ్ళాలన్నారు.లక్ష్యాన్నిఏర్పాటు చేసుకొని శ్రద్ధ పెట్టి చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా విశ్రాంత ఉపాధ్యాయులు జింధం నరహరి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యోగస్తులు,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థినీ,విద్యార్థులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.