మచ్చర్ల గ్రామంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం – విద్యా సదస్సు…
ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో విద్యార్థుల ముందు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు...స్థానిక గ్రామ సర్పంచ్ కట్ట మల్లవ్వ-ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరి సభాధ్యక్షత వహించగా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దాదాపు 30 మంది ఉద్యోగులు హాజరైనారు.గ్రామ ఆత్మీయ ప్రముఖులు గుమ్మడి విట్టల్,ఆరె జగదీశ్వర్,డాక్టర్ మనోహర్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పండరి, కార్యక్రమ నిర్వాహకులు గ్రామ ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం సాధించే దిశగా ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు.హాజరైన 30 మంది ఉద్యోగులు...