31.8 C
Hyderabad
Sunday, September 27, 2026

15 నిమిషాల్లో స్వీయ జనగణన నమోదు-బాల్కొండ చార్జ్ ఆఫీసర్ శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన 2027 ను స్వీయ గణనతో ఏప్రిల్ 26 నుంచి ప్రారంభించామని మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్ల వారీ గణన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానాన్ని ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో లోని సమావేశ మందిరంలో ఆయన మండల స్థాయి అధికారులతో, ఇతర అన్ని శాఖల వారితో ,సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ చార్జ్ ఆఫీసర్ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈసందర్భంగా ఆయన మ రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ ఏప్రిల్ నెల26 నుంచి మే 10 వరకు నిర్వహిస్తామన్నారు. జనగణనను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తున్నదని మొదటి విడత మే 11 నుంచి జూన్‌ 9 వరకు హౌస్‌ లిస్టింగ్‌ హౌస్‌ సెన్సెస్‌ ఉంటుందని, ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన ఉంటుందని తెలిపారు. ముఖ్యమైన స్వీయ గణనలో అందరూ భాగస్వాములు కావాలని, తమ వివరాలను స్వయంగా అధికారిక వెబ్‌ పోర్టల్‌ se.census.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో 34 రకాల ప్రశ్నలు ఉంటాయని అవి కూడా జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆస్తుల తదితర వివరాలు ఉంటాయని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు 19 నుంచి 15 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని, నమోదు పూర్తయ్యాక మొబైల్‌ లేదా ఈమెయిల్‌కు ఒక SE ID వస్తుందన్నారు. ఎన్యూమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఈSE ID చూపిస్తే ఏలాంటి తప్పుల్లేకుండా సులభంగా నమోదవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ సంస్థల సిబ్బంది, సాధారణ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అడిషనల్ చార్జ్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి పిలుపునిచ్చారు.

స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. తప్పులు తగ్గుతాయి. కచ్చితమైన సమాచారం లభిస్తుంది. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, గ్రామీణ-పట్టణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించేందుకు వీలుంటుందన్నారు. జన గణనను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు ఇండ్ల గణన, రెండో విడతలో జనగణన నిర్వహిస్తామని పేరొన్నారు. డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన, స్పష్టమైన జాబితా రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు తగిన శిక్షణను ఇచ్చినట్లు తెలిపారు.

స్వీయ గణన నిర్వహణలో భాగంగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ వ్యక్తులు, గ్రామపంచాయతీ సెక్రటరీల ద్వారాఅందరికీ తెలిసే విధంగా విసృ్తత ప్రచారం నిర్వహించాలని సూచించారు. గణన అధికారులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా విసృ్తత ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు., అధికారులు, స్వీయ గణన కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని నిర్దేశించారు . ఏప్రిల్ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో https://sc.census.gov.in  వెబ్‌ సైట్‌ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని తెలిపారు.-

సమావేశంలో మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి , మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.