28.2 C
Hyderabad
Saturday, September 26, 2026

మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి  జన్మదిన సందర్భంగా, బాల్కొండ మండల కేంద్రంలోని “వీ” కన్వెన్షన్ హాల్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోర్త రాజేందర్ , వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా, అత్యవసర సమయంలో అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. రక్తదాన శిబిరానికి స్పందించి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.