బాల్కొండ :బాల్కొండ మండలం లోని చిట్టాపూర్ ఉన్నత పాఠశాల లో సర్పంచ్ సట్ల గంగా ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు ప్రభుత్వ యూనిఫాంలు, బూట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సారెడ్డి, భృగు మహర్షి, రామారెడ్డి, శ్రీనివాస్,పద్మ, రాజేందర్ గౌడ్, ప్రవీణ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..
హైస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వ యూనిఫాంలు,బూట్ల పంపిణి




