25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

అక్క…! కాదు , ఇప్పుడు అమ్మ…!!

Must read

📰 Generate e-Paper Clip

దశాబ్దం పైగా తమిళనాడులో వినిపించిన పేరు…ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మారి మ్రోగిపోనుంది… అక్క… కవితక్క అని నోరార పిలిపించుకున్న ఆమె పూర్తిగా… ఇపుడు అమ్మ అవతారం ఎత్తి… అచ్చం తమిళనాడు జయలలితను పోలి ఉండేలా తెలంగాణలో మలిదశ రాజకీయ ఆరంగేట్రం చేసింది. వారసత్వ రాజకీయాలకు తాను అతీతము అన్న సంజ్ఞ ఇస్తూనే తమిళనాడు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన అంశాలతో ఆమె కొత్త పార్టీకి సమర శంఖం పూరించారు…

అవును, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్లీ పుట్టిం ది… తండ్రి కేసీయార్ విసిరిపారేసిన ‘తెలంగాణ’ బిడ్డను…ఆమె  స్వయంగా అక్కున చేర్చుకుంది… జాగృతి పార్టీ అని, టీపీఎస్ అనీ ఏవేవో పేర్లను ప్రచారంలో పెట్టడం ద్వారా బీఆర్ఎస్ ను మాయ చేసి భలే గోప్యత మెయింటైన్ చేస్తూ ఒకరకంగా బీఆర్ఎస్ పార్టీముఖ్యులకు… ప్రత్యేకించి అన్నకు, తండ్రికి, హరీష్ రావు అండ్ కో అందరికీ కవిత  ఫస్ట్ మెయిన్ స్ట్రో క్… ఇచ్చిన తీరు రాజకీయ పండితులను ఆశర్య పరిచింది . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో కవిత కొత్త పార్టీ పేరు , జెండాను ఆవిష్కరించారు. కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని ప్రకటించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుతో కూడిన జెండాను ఆవిష్కరించారు. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై TRS అనే అక్షరాలతో పార్టీ జెండాను రూపొందించారు.

అధికారికంగా… పార్టీ ఆవిర్భావం సందర్భంగా… అంటే తెలంగాణ రాష్ట్ర సేన… సింపుల్, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండేది… ఇప్పుడు సమితి బదులు సేన… దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని మోసిన పేరు అది… ఈ బిడ్డ వశమైపోయింది…గతంలో కవిత తండ్రిని టార్గెట్ర్గె చేసేది కాదు… ఇప్పుడు స్ట్రె యిట్ గానే కొడుతోం ది… తప్పుల కుటుంబ సభ్యురాలిగా సిగ్గు పడుతున్నా ను అనే ఒప్పుకోలు ప్రకటన కేసీఆర్ పట్ల తీవ్ర అభిశంసన…అని చెప్పక తప్పదు.

ఇక పార్టీ విషయానికి వస్తే …. బ్లూ తెలంగాణా పటంపై TRS అక్షరాలు పెట్టి తనది బహుజన ఎజెండాగా,
చెప్పుకోవటం తెలివైన పనే అయినప్పటికీ పార్టీ జెండా లో వాడిన కలర్లు, సంతృప్తి రాజకీయాలకు దగ్గరగా ఉన్నాయని , మొత్తానికి కవితమ్మ వస్త్రధారణ , హావభావాలు పూర్తి గా పల్లె జనాలకు దగ్గర చేయడం తధ్యం . ఇక పాంచజన్యం హామీ లో భాగంగా అటు ప్రభుత్వ ఇటు ప్రయివేట్ పాఠశాలలో ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం అంశాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయడంలో కీలకం కానున్నాయి .

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.