సంస్కృతి, సాంప్రదాయం, భక్తి వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టడంలో ముందు వరస లో ఉండే బాల్కొండ పట్టణంలోని దాస్ హన్మాన్ కమిటీ ఆధ్వర్యంలో మరొక అద్భుత కార్యక్రమం జరిగింది. బాల్కొండ పట్టణంలో తారక మంత్రం మార్మోగింది. శ్రావణమాసము అఖండ జ్యోతి ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తన కార్యక్రమం కనుల విందుగా జరిగింది. ఏకంగా 86వేల 400 సెకండ్ల పాటు ( 24 గంటలు) చేపట్టిన ఈ మహత్తర సంకీర్తన కార్యక్రమంకు విశేష ఆదరణ లభించింది. చిన్న, పెద్ద తేడా లేకుండా భక్తులు భక్తి పరవశ్యంలో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు ఠాగూర్ బలరాం సింగ్, బిబిసి సాయిలు, తోట చిన్నయ్య, ఠాకూర్ రాము, కమ్మరి రాజేశ్వర్, భూషం కిట్టు, అంబటి కిషన్, కటకము రవి, శ్రీనివాస్, సర్పంచ్ గాండ్ల రాజేష్, మాజీ సర్పంచ్ తౌటు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.




