బాల్కొండ :బాల్కొండ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను శనివారం మండల కేంద్రవాసులు ముట్టడించారు. గత వారం రోజుల నుండి కరెంటు సరఫరా సరిగ్గా లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపించారు. విద్యుత్ శాఖ ఆర్మూర్ డిఈ రఘు, ఏ డి ఈ శ్రీనివాస్ శ్రీనివాస్. సమస్యను పక్షం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏఈ కిషన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి యూనూస్, మాజి కో ఆప్షన్స్ సభ్యుడు షాహిద్, భూసం కిట్టు, శివ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన బాల్కొండ వాసులు




