మెండోరా: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులను విడుదల చేయడంతో మెండోరా మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడాల సాయరెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం అభినందనీయమన్నారు. రైతులకు సాగు పెట్టుబడి భారం తగ్గించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు నోముల రాజన్న, సర్పంచ్ల పోరం అధ్యక్షుడు శ్రీనివాస్ , గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్ల పోరం అధ్యక్షుడు బద్ధం శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
రైతు భరోసా నిధుల విడుదలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు




