రైతు భరోసా నిధుల విడుదలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు

మెండోరా: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులను విడుదల చేయడంతో మెండోరా మండల కేంద్రంలో కాంగ్రెస్  శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడాల సాయరెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం అభినందనీయమన్నారు. రైతులకు సాగు పెట్టుబడి భారం తగ్గించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు నోముల రాజన్న, సర్పంచ్ల పోరం అధ్యక్షుడు శ్రీనివాస్...