ఆర్మూర్ మండలంలోని చేపూర్ సాయిబాబా ఆలయంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కు చెందిన దొంతుల రవీందర్ కుమార్తె వైష్ణవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్. కే. రవీందర్ మాట్లాడుతూ ప్రతీ గురువారం కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బాజన్న, లింగన్న, రాజు,శ్రీను,రఘు, బాలయ్య,వెంకటేష్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




