ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ హెడ్మాస్టర్ గా వివిధ పాఠశాలల్లో పనిచేసి ఎంతో కీర్తిని గడించిన అనుభవంతో రవీందర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా తాను పనిచేసిన పాఠశాలల సర్వతో ముఖాభివృద్ధికి కృషిచేసి, గ్రామస్తుల హృదిలో విద్యార్థుల మదిలో చెరగని ముద్ర వేసి,విద్యా రంగంలో ఎనలేని సేవలు అందించిన రవీందర్ ప్రస్తుతం ఎంఈవో గా అపాయింట్ కావడం మండల వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీ ఆర్ టి యు ఆర్మూర్ మండల శాఖ అధ్యక్షులు ఇట్టెం గోపాల్ మరియు అర్బన్ అధ్యక్షులు గద్దె గంగాధర్ కార్యవర్గ సభ్యులతో పాటు మామిడిపల్లి హెడ్మాస్టర్స చాంబర్లో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గోపాల్, గంగాధర్ మాట్లాడుతూ సౌమ్యశీలి అందరితో కలుపుగోలు గుణంగల, అజాతశత్రువు పాఠశాలల అభివృద్ధే తన ఏకైక లక్ష్యంగా నిరంతరం కృషిచేసే, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ బీసీల ముద్దుబిడ్డ ఎంఈవో స్థాయిలో ఎదగడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉందని,ఈ సందర్భంగా శాలువలతో సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో ఆర్మూర్ విద్యా రంగం జిల్లా, రాష్ట్ర స్థాయిలో వెలుగొందాలని కోరారు.
ప్రధానోపాధ్యాయులు రవీందర్ ను సన్మానించిన పీ ఆర్ టీ యు నాయకులు …




