Wednesday, June 10, 2026

మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

మెండోరా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జాదవ్ సుహాసిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This