26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

మచ్చర్ల (ఆలుర్ )లో మొగిలి సుదర్శన్ సేవలు మరువలేనివి…

Must read

📰 Generate e-Paper Clip

ఆలూర్: ఆలూర్ మండలంలోని మచ్చర్ల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సోషల్ స్కూల్ అసిస్టెంట్ మొగిలి సుదర్శన్ ఈనెల 30వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఈ రోజు మచ్చర్ల గురెడి రెడ్డి కళ్యాణ మండపంలో సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారి పండరి సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఆలూర్ మండల ఎంఈవో నరేందర్, నాయక్ పోడ్ సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్, కార్యదర్శి పుట్ట శివశంకర్,విశిష్ట అతిథులుగా మచ్చర్ల సర్పంచ్ శ్రీమతి కట్ట మల్లవ్వ, ఉప సర్పంచ్ కట్ట నర్సారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆలూర్ మండల పీఆర్టీయు కార్యదర్శి జిందం శివప్రసాద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాబన్న,నందిపేట్ పీఆర్టీయు అధ్యక్షులు భూషణ్ కార్యదర్శి రమేష్, డొంకేశ్వర్ పీఆర్టీయు అధ్యక్షులు రాజేశ్వర్ లు పాల్గొని శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన ఆత్మీయ బంధువులను సత్కరించారు.తర్వాత పాఠశాల హెచ్ ఎం అండ్ స్టాఫ్ పక్షాన ఒకటి,వారి బావ గాండ్ల రాంచందర్ పక్షాన ఒకటి సన్మాన పత్రాలు జింధం నరహరి రూపొందించిన “సన్మాన-ఆనంద వల్లి,అక్షర సుమాంజలి” అనే 2 కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎంఈవో ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎంఈవో నరేందర్ ఆదివాసి నాయక్ పోడ్ జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచంద్రర్ మాట్లాడుతూ 35 వసంతాలుగా మొగిలి సుదర్శన్ విద్యారంగంలో చేసిన సేవలు అభినందనీయమని, సుదర్శన్ ఎక్కడ పని చేసినా విద్యార్థుల పక్షపాతిగా అంకితభావంతో సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చారని అన్నారు. పాఠశాలలో సేవలు అందిస్తూనే కుటుంబంలో తన ఇద్దరు కూతుర్లు, కుమారుడిని అత్యున్నత చదువులు చదివించి ఉద్యోగాలలో స్థిరపడేటట్లు ప్రోత్సహించారు. విరమణ తర్వాత కుటుంబానికి సమయాన్నిచ్చి సమాజ సేవ చేయాలని, నాయక పోడు సంఘానికి అండగా నిలవాలని, తీర్థయాత్రలు తిరగాలని కోరారు. సభాధ్యక్షులు బండారి పండరి, స్థానిక సర్పంచ్ కట్ట మల్లవ్వ, ఉప సర్పంచ్ కట్ట నర్సారెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో గత 2 సంవత్సరాల నుండి అద్భుతమైన సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు.

మొగిలి సుదర్శన్ మాట్లాడుతూ తాను ఎక్కడ పని చేసినా గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సహకరించేవారని, విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించడం తనకు చాలా ఇష్టమని, గ్రామస్తుల సహకారంతో ఎక్కడ పనిచేసిన పాఠశాలను అభివృద్ధి చేస్తూ, విద్యార్థులలో నిబిడీకృతమైన అంతర్గత శక్తులను వెలికి తీసి రేపటి సమాజాన్ని దేశాన్ని కొన్ని కోట్ల క్షణాలు కాపాడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వాడినని అన్నారు. ఈ కార్యక్రమానికి జింధం నరహరి,విశ్రాంత ఉపాధ్యాయులు సమన్వయకర్తగా వివరించారు. ఈ కార్యక్రమంలో మచ్చర్ల పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు,బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు తనతో పాటు పనిచేసిన కొలీగ్ టీచర్స్ బంధువులు, వివిధ మండలాల నుండి వచ్చిన పీఆర్టీయు నాయకులు హాజరై శాలువలు, పూలమాలలతో సన్మానించి “ఉద్యోగ విరమణ” శుభాకాంక్షలు తెలియజేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.