25.8 C
Hyderabad
Saturday, August 15, 2026

వన్నెల్ (కే) ఉన్నత,ప్రాథమిక పాఠశాలలలో 145 మంది విద్యార్థులకు షూస్ వితరణగా అందచేత…

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) ఉన్నత, ప్రాథమిక పాఠశాలలలో 145 మంది విద్యార్థులకు షూస్ వితరణగా అందజేసి సమాజ సేవకు నిదర్శనంగా నిలిచిన బండి చిత్ర-రవి కుమార్ దంపతులు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న హై స్కూల్ విద్యార్థులు,ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు కలిపి 145 మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ షూస్‌ను ఉచితంగా అందజేసి గ్రామస్తులందరితో అభినందనలు,ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా బండి చిత్ర-రవికుమార్ మాట్లాడుతూ గత 3 నెలల అంగన్వాడి ఇన్స్ట్రక్టర్ జీతాన్ని ఈ సేవా కార్యక్రమానికి వెచ్చించి విద్యార్థుల అవసరాన్ని తీర్చామని,80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు అందజేయడం మాకు ఆనందంగా ఉందన్నారు.“పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడటమే మా కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు.పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు వారి సేవా భావాన్ని అభినందిస్తూ,విద్యార్థుల పట్ల చూపిన మానవత్వం సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ,సహోపాధ్యాయులు   అంగన్వాడి బోధకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.