ముప్కాల్ : మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు,ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ నునుగొండ అంజయ్య అకాల మరణం పొందారు.దాతృత్వం,సేవాగుణం గల నునుగొండ అంజయ్య విద్యారంగంలో,సమాజంలో ఎనలేని సేవలందించారు.ఉపాధ్యాయుడిగా ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దారు.కరిగే కాలంలో తరగని జ్ఞాపకంగా కదిలి ఆలోచనలో చెరగని స్మృతిగా మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించి అర్దాంతరంగా అనంత లోకాలకు వెళ్లిన వీరి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ,కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ…అశేష జనవాహిని అంతిమయాత్రలో పాల్గొని,శిష్యులు,బంధువులు కన్నీటిపర్యంతమై కన్నీటి వీడ్కోలు పలికారు.
ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్,రిటైర్డ్ టీచర్ నునుగొండ అంజయ్య కు కన్నీటి వీడ్కోలు…




