మెండోరా: మెండోరా మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్-కుక్ పోస్టు భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి (ఎస్ఓ) పద్మ తెలిపారు.
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు వంట చేయడంలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రస్తుతం కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 360 మంది విద్యార్థినులు చదువుతున్నందున, సమయానికి నాణ్యమైన భోజనం సిద్ధం చేసే సామర్థ్యం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూలై 14, 15, 16 తేదీల్లో తమ దరఖాస్తులతో పాటు 7వ తరగతి బోనాఫైడ్ లేదా టీసీ, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతర సంబంధిత ధ్రువపత్రాలను కేజీబీవీ మెండోరా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
పోస్టుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కేజీబీవీ మెండోరా యాజమాన్యాన్ని సంప్రదించాలని ప్రత్యేక అధికారి పద్మ తెలిపారు.




