26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష, తులం బంగారం ఇవ్వాలి_ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారునికి, అలాగే ప్రస్తుతం కొత్తగా మంజురు కాబోయే లబ్దిదారులకు లక్ష రూపాయల చెక్‌తో పాటు తులం బంగారం ఇవ్వాలని బాల్కొండ  ఎమ్మెల్యే , మాజీ మత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద కొత్తగా మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మొత్తం 127 బ్యాచ్ ఫైల్స్‌పై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు.బాల్కొండ (19), వేల్పూర్ (20)మెండోరా (15), ముప్కాల్ (10), మోర్తాడ్ (24), భీంగల్ (39) మండలాలకు చెందిన ఈ ఫైల్స్‌ను ఆయన బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరిశీలించి సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా, ఫైల్స్‌ను మీ వద్ద పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే అవసరమైన సంతకాలు పూర్తిచేసి ప్రభుత్వానికి పంపించాలని తహషీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

డిజిటల్ మీడియాలో తాజా వార్తలు అందించడానికి ఇప్పుడే చేరండి… నో యాడ్స్… నో టార్గెట్స్… నో సర్కులేషన్…👇👇👇👇👇https://subhodayam.news/join-reporter/

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.