26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

దొన్కల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.కే జగదీశ్వర్ సేవలు మరువలేనివి…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ : పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆర్మూర్ వాస్తవ్యులు డీకే జగదీశ్వర్ దొన్కల్ పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఆత్మీయ బంధుమిత్రులు శ్రేయోభిలాషులందరికీ అందుబాటులో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఆర్మూర్ క్షత్రియ కల్యాణ మండపంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో అశోక్ కుమార్ పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి కార్యదర్శి కిషన్ క్షత్రీయ సమాజ్ అధ్యక్షులు గటడి ఆనంద్, పట్టు సహకార సంఘం అధ్యక్షులు గంగామోహన్ చక్రు, క్షత్రీయ సమాజ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ ఖాందేశ్,ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్, కమ్మర్ పల్లి ఎంఈవో లు రాజగంగారాం ఆంధ్రయ్య, పి ఆర్ టి యు నాయకులు గోపాల్, గంగాధర్, రాములు తదితరులు పాల్గొని 31 వసంతాలుకు వివిధ పాఠశాలల్లో విద్యా రంగంలో ఎనలేని సేవలందించిన డీకే జగదీశ్వర్ సేవలను అభినందించి,శాలువలు పూలమాలలతో సత్కరించారు.

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ డి.కే జగదీశ్వర్ హెచ్ పి 2 SGT గా కన్వర్షన్ అయి SA మ్యాచ్ నుండి SA ఫిజికల్ సైన్స్ గా కన్వర్షన్ అయి GHM గా ప్రమోషన్ పొందారని,31 వసంతాలుగా విద్యా రంగంలో ఎనలేని సేవలు అందించారని,ఎందరో అధికారుల మెప్పుపొంది విద్యార్థులను జాతి గర్వించే ఉత్తములుగా ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత గల జగదీశ్వర్ వారి సతీమణి గంగామణి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అనునిత్యం ఆనందంగా గడవాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ డీ.కే జగదీశ్వర్ మొదటి నుండి పి ఆర్ టి యు సంఘ సేవకుడని వివిద హోదాలను ఉపాధ్యాయులకు ఎనలేని సేవలందించారని సమయపాలన,అంకితభావం గల ఇలాంటి ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారంటే విద్యా రంగంలో లోటు ఏర్పడుతుందని, డీ.కే జగదీశ్వర్ పి ఆర్ టి యు సంఘంలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసి వివిధ హోదాలను పనిచేశారని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో చాలా కృషి చేశారని,ఈ దంపతుల శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

సన్మాన గ్రహీత డీ కే జగదీశ్వర్ మాట్లాడుతూ ముందుగా తల్లిదండ్రులకు గురువులకు నమస్కరించి ఎక్కడ పని చేసినా విద్యార్థులలో నిబిడీకృతమైన అంతర్గత శక్తులు వెలికి తీసి రేపటి సమాజానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దానని పనిచేసిన ప్రతిచోట గ్రామస్తులు, తల్లిదండ్రులు, సహోపాధ్యాయులు సహకారం అందించే వారిని అందరితో సక్యతగా మెదిలి ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్నానని నా ఆహ్వనాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన నన్ను ఆశీర్వదించి శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మీయ బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా కోకిల నాగరాజు,జింధం నరహరి వ్యవహరించారు. మధ్య మధ్యలో పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.