నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మోతె సాయన్న ఉపాధ్యాయ వృత్తి విరమణ సందర్భంగా గ్రామ పొలిమేరలోని మొటాటిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు మీనాక్షి సన్మాన గ్రహీత దంపతులు మోతె సాయన్న – విజయ లను ఫంక్షన్ హాల్ ముందు నుండి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వేదికపైకి తీసుకొచ్చారు.తర్వాత కార్యక్రమానికి హాజరైన వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు,గౌరవ అతిథులకు పుష్పగుచ్ఛాన్నిచ్చి, బ్యాడ్జి ధరింపజేసి, శాలువతో సత్కరించి,జ్ఞాపకలను అందజేశారు. ఆత్మీయ బంధువులు, మిత్రులు,శ్రేయోభిలాషులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ముందుగా సన్మానగ్రహీత మోతె సాయన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను పునికి పుచ్చుకొని ఎస్సీ,ఎస్టీ యూనియన్ వ్యవస్థాపకుడిగా ఒకవైపు పాఠశాల విధులను నిర్వహిస్తూనే, దళిత జాతి ముద్దుబిడ్డగా మరోవైపు నాయకత్వ లక్షణాలతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన ఘనతగల మోతె సాయన్న “ఉద్యోగ విరమణ” కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి,చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన గావించారు.అనంతరం తనకు చిన్ననాడు అక్షరాలు దిద్దించి, ఇంతటి వాడిని చేసిన గురువులను సన్మానించి పాదాభివందనం చేసి,ఆశీర్వచనాన్ని పొందారు. తర్వాత రిటైర్డ్ టీచర్ ఆత్మీయ మిత్రుడు జింధం నరహరి రూపొందించిన అక్షరాభిషేకం-అభినందన నామాక్షరమాల అనే సన్మాన పత్రాన్ని కరపత్రాల రూపంలో ఆవిష్కరింపజేసి అతిపెద్ద జ్ఞాపకను బహుకరించారు. సందర్భోచితంగా పదవీ వీడ్కోలందుకో ఓ సాయన్న సారు విద్యార్థుల సంఘ నాయకుల జేజేలందుకో… అనే పాట అందర్నీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్ వీడిసి అధ్యక్షులు,క్యాషియర్ఎ,స్సీ ఎస్టీ యూనియన్బి,బీటిఏ,యుటిఎఫ్, పీఆర్టీయు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ నాయకులు, తాను పనిచేస్తున్న పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, కొలిగ్ టీచర్స్, బంధువులు, మిత్రులు,శ్రేయోభిలాషులు మాట్లాడుతూ చిన్ననాటి నుండి పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లు క్లాస్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ గా అందమైన దస్తూరి తో ఉపాధ్యాయులు, వార్డెన్ ప్రోత్సాహంతో ఇంటి పరిస్థితులను లెక్కచేయకుండా అకుంటిత దీక్షతో,పట్టు వదలని విక్రమార్కుడిగా 1989 డీఎస్సీలో మూడవ ర్యాంకు సాధించి ఉద్యోగాన్ని సంపాదించారు. అప్పటినుండి నేటి వరకు అనగా 30 జూన్ 2026 విరమణ వరకు ఎందరెందరో విద్యార్థుల్ని జాతి గర్వించే ఉత్తములుగా,ఉన్నతులుగా తీర్చిదిద్దారని, ఈ దంపతుల శేష జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అనునిత్యం ఆనందమయంగా గడపాలని మనుమలు మనుమరాండ్లతో వసుదైక కుటుంబంగా వెల్లి విరియాలని,ఈ ఉద్యోగ విరమణ కేవలం ఉద్యోగానికి మాత్రమే విరమణ అని, సేవలకు విరమణ కానే కాదని, మిగిలిపోయిన ఆశయాలు,సిద్ధాంతాల కొరకు సమాజ సేవ చేస్తూ ఉండాలని, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు తిరిగి ఆనందమయ జీవితాన్ని గడపాలని ఆ భగవంతుడు శక్తి, యుక్తులు ప్రసాదించాలని వారి వారి ఉపన్యాసాలలో సన్మాన గ్రహీత మోతె సాయన్న ఎల్. ఎఫ్. ఎల్. హెచ్ఎం సేవలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.




