హెచ్ఎం మోతె సాయన్న “ఉపాధ్యాయ వృత్తి విరమణ” సందర్భంగా సాయన్న సేవలు మరువలేనివి…

నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మోతె సాయన్న ఉపాధ్యాయ వృత్తి విరమణ సందర్భంగా గ్రామ పొలిమేరలోని మొటాటిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు మీనాక్షి సన్మాన గ్రహీత దంపతులు మోతె సాయన్న - విజయ లను ఫంక్షన్ హాల్ ముందు నుండి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వేదికపైకి తీసుకొచ్చారు.తర్వాత కార్యక్రమానికి హాజరైన వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు,గౌరవ అతిథులకు పుష్పగుచ్ఛాన్నిచ్చి, బ్యాడ్జి ధరింపజేసి, శాలువతో సత్కరించి,జ్ఞాపకలను అందజేశారు. ఆత్మీయ బంధువులు, మిత్రులు,శ్రేయోభిలాషులు అందరి సమక్షంలో ఘనంగా...