26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ గెలుపు సంబరాలు.

Must read

📰 Generate e-Paper Clip

ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపు సాధించిన సందర్బంగా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. అధ్యక్షులు మాట్లాడుతూ బెంగాల్ లో ఇన్ని రోజులు మమతా బెనర్జీ అక్రమ వలసదారులను రాష్ట్రంలో చేర్చుకుని వారికీ ఓటు హక్కు కల్పించి ఓటుంబ్యాంక్ గా మలుచుకొని పాలన సాగించారు. Sir వలన ఆ ఓట్లు తీయడం తో ఈ రోజు ఫలితాలలో ఘోర పరాజయం పాలయిందన్నారు. ప్రపంచ దేశాలకు హైందవ ధర్మాన్ని వ్యాపింప జేసిన స్వామి వివేకానంద పుట్టిన గడ్డ పై కాషాయ జెండా ఎగిరిందన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఎక్కడ ఐతే జనతా పార్టీ స్థాపించారో అక్కడ గెలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని అన్నారు. భారత సరిహద్దు ఇప్పుడు అత్యంత ప్రతిష్టత్మకం అవుతుందన్నారు. మోడీ అమిత్ షా ల పాలన రానున్న తెలంగాణాలో ఇదే ఫలితం వస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మం ప్రధానకార్యదర్శి జమిలిగిరి సాయికిరణ్, ఉపాధ్యక్షులు కాల రవి, బూసం సత్యనారాయణ, కిసాన్ మోర్చా మం, కార్యవర్గసభ్యులు తోట చిన్నయ్య, కిసాన్ మోర్చా మం, అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, బీజేవైఎం మం, అధ్యక్షులు శేరియాల సాయి కార్తీక్, ఎస్ సి మోర్చా మం, అధ్యక్షులు చేపూర్ గంగాధర్,బీజేపీ నాయకులు తోపారం అశోక్, ఠాకూర్ రాము, తోట నవీన్, ఆరెపల్లి రవీందర్, నందిన్, లింగం, రాంకిషన్, పవన్, శివ, అనిరుద్, నవనీత్, తోట నాగేష్, రాజేష్, ఇదన్ రావు, శుభాష్, రాజు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.