మెండోరా:మండల కేంద్రంలో సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రం కేంద్రాలను ప్రారంభించారు. మొదటి కేంద్రాన్ని వివేకానందుని బస్టాండ్ సమీపంలో సఫాయి కార్మికురాలితో ప్రారంభించడం ప్రత్యేకంగా నిలిచింది. రెండవ చలివేంద్రం కేంద్రాన్ని వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్, వార్డు సభ్యులు సాయన్న, శ్రీనివాస్, శంకర్, మమత, కారోబార్ చిరంజీవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...