24.7 C
Hyderabad
Thursday, August 13, 2026

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీసీ సెల్ అధ్యక్షులు ధోండి రమణ…

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ… తెలంగాణ ప్రజలందరికీ బీసీ సెల్ అధ్యక్షులు ధోండి రమణ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తూ రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఆరోగ్య సేవల విస్తరణ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహిళా సంఘాల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు భూములు, రుణాలు, వ్యాపార అవకాశాలు కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టబడుతున్నాయన్నారు.

అలాగే తెలంగాణను భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని,అమరవీరుల ఆశయాల సాధనే మన లక్ష్యం…ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం…అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్దామని,తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండవ దఫా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలుపుతూ తెలంగాణ ప్రజలందరికీ “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు” తెలియజేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.