25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

అగ్ని ప్రమాదాలు నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ పట్టణంలోని ఉద్యోగుల విశ్రాంతి భవనంలో విశ్రాంత ఉద్యోగులకు అగ్నిమాపక సిబ్బంది “అగ్ని ప్రమాదాలు-నివారణ చర్యల గురించి సదస్సు” కార్యక్రమాన్ని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శి జ్ఞానేశ్వర్,ఆర్థిక కార్యదర్శి నవజీవన్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఫైర్ హెడ్ కానిస్టేబుల్ యు.సురేష్, ఫైర్ ఫైటర్స్ విజయేందర్,శ్రావణ్ గౌడ్ లు పాల్గొన్నారు. ఫైర్ హెడ్ కానిస్టేబుల్ యు. సురేష్ మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించాలని, వెలిగించిన దీపాలు,గ్యాస్ స్టవ్ లను నిర్లక్ష్యంగా వదిలివేయకూడదని, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని,ప్రమాద సమయాలలో ప్రశాంతంగా వ్యవహరించి వెంటనే సహాయక సేవలకు సమాచారం అందజేయాలన్నారు. “జాగ్రత్తే ప్రాణ రక్షణ” అనే భావంతో అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా యు. సురేష్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ ఎప్పుడు ఎక్కడ అగ్నిప్రమాదం సంభవించినా 101 లేదా ఆర్మూర్ అగ్నిమాపక కేంద్రం 8712699228 కు ఫోన్ చేసి ఎక్కడ జరిగిందో తగిన సమాచారం తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, ఫైర్ సిబ్బంది యు.సురేష్,విజయేంధర్ శ్రావణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.