25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

ఆర్మూర్ మండలం స్థాయిలో న్యాయ చైతన్య సదస్సు…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి బాపూజీ మాసన్ సంఘం తిరుమల నగర్ కాలనీ లో మే 1 నుండి 10వ తేదీ వరకు మే డే సెలబ్రేషన్ లో భాగంగా మండల న్యాయ సేవ అధికారుల సంఘం ఆధ్వర్యంలో న్యాయ చైతన్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ కోర్ట్ సివిల్ జడ్జ్ శ్రీదేవి, లేబర్ ఆఫీసర్ ప్రభుదాస్, ఎన్ఏసి సెంటర్ నిజామాబాద్ ఏడి లింబాద్రి, జిల్లా క్యాంప్ ఆఫీసర్ మల్లికార్జున్ బార్ కౌన్సిల్  మాజీ అధ్యక్షులు జక్కుల శ్రీధర్ పాల్గొని.న్యాయ చైతన్య సదస్సులో చట్టాల పై అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి మాట్లాడుతూ చట్టాలు ఎవరికి చుట్టాలు కారని, చిన్న చిన్న తగాదాలకు కోర్ట్ వరకు రాకుండా ఓపికతో ఇంటి వద్దే పరిష్కరించుకోవాలని చట్టం, న్యాయం,ధర్మం అందరికీ సమానంగా ఉంటుందని,ప్రజలు చట్టాల పరిధిలోకి రాకుండా సమస్యలను మీకు మీరే పరిష్కరించు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తిరుమల కాలనీ వాసులు అధికారులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.