26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

ఆర్మూర్ లో నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్డీవో ఆఫీస్ ముందు విశ్రాంతి ఉద్యోగుల నిరసన ప్రదర్శన…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ :ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు జేఏసి పిలుపుమేరకు సంఘ భవనం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పెన్షనర్స్ నల్లబ్యాడ్జిలు ధరించి తమ సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ రావు,ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల కు ఏలాంటి సౌకర్యాలు,సదుపాయాలు కల్పించడం లేదని అందుకు నల్లబడ్జీలతో నిరసన తెలుపుతున్నామన్నారు.

మా అపరిస్క్రుత సమస్యలు
2 వ పీఆర్సీని 51% ఫిట్మెంట్ తో పెన్షనర్స్ అందరికీ వర్తించేటట్లు అమలు చేయాలని,పెన్షనర్స్ పెండింగ్ బిల్లులు ఒకేసారి చెల్లించాలని,పెన్షనర్స్ కు ఈహెచ్ఎస్ కార్డులు ఇస్తూ,హెల్త్ స్కీమును వర్తింపజేస్తూ వెంటనే అమలు చేయాలని,సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను వెంటనే పునరుద్ధరించాలని, ప్రభుత్వం ముందున్న 63 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్మూర్ సబ్ కలెక్టర్ కు వినతిపత్రాము అందజేశారు. దశలవారీగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ కోశాధికారి నవజీవన్,గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుష్పకర్ రావు,ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు అసోసియేట్ అధ్యక్షులు గంగారెడ్డి, ఉపాధ్యక్షులు కోటేశ్వర్, సుధాకర్, సహాయ కార్యదర్శి గంగాధర్,ఆర్గనైజింగ్ సెక్రెటరీ హరి నారాయణ,పబ్లిసిటీ సెక్రెటరీ జింధం నరహరి,జిల్లా కౌన్సిలర్లు ఎం.సి.ఓబన్న, భూమయ్య,దశరథ్,ఆడిటర్స్ ముత్తెన్న, సుదర్శన్,గేమ్స్ సెక్రెటరీ కరాటే భోజన్న పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.