25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం బట్టబయలు – వెలుగులోకి ₹152 కోట్ల లావాదేవీలు, 9 మంది అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాదు జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి , శ్రద్ధ నిలుపుతూ తనదైన ముద్ర ను కనబరుస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్న తన క్రింది స్థాయి పోలీసు లకు పూర్తి స్థాయీ లో ప్రోత్సాహం , సూచనలు ఇస్తూ అనేక నేరాలను కట్టడి చేస్తున్నారు. తాజా గా నకిలీ పత్రాలతో బ్యాంక్ ఖాతాలు – సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్ ను పోలీసులు చేదించారు .

నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య పర్యవేక్షణలో సైబర్ నేరాలపై పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించడం జరిగింది. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా, కర్ణాటక బ్యాంక్‌లో తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించి అక్రమంగా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు వెలికితీశారు.

ఈ నిందితులు ఫేక్ డాక్యుమెంట్స్‌తో బిజినెస్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే విధంగా అందించినట్లు గుర్తించబడింది. ఈ అకౌంట్ల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు రూ. 152 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. మరికొంతమంది వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. బ్యాంక్ అధికారులు కస్టమర్ ఇచిన ధ్రువ పత్రాలు సరిగా ధృవీకరించక అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. అట్టి వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడును.

అరెస్ట్ చేసిన నిందితులు:
మహమ్మద్ జామెల్ అహ్మద్ – అర్సపల్లి
షేక్ షోయబ్ – యడపల్లి
మహమ్మద్ సమీర్ – నిజామాబాద్
భాను ప్రసాద్ – బోధన్
మహమ్మద్ అర్బాజ్ – బోధన్
బొగుడమీది వీరేశం – బోధన్
రహీమ్ అలీ – నిజామాబాద్
అబ్దుల్ వాసిమ్ – బోధన్
షేక్ సమీర్ – బోధన్
షేక్ అహ్మద్ – నిజామాబాద్
షేక్ రహీం – నిజామాబాద్
షేక్ ఇఫ్తెఖార్ – రెంజల్
సబావత్ అశోక్ – రెంజల్

పైన పేర్కొన్న నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు పంపడం జరిగింది.

అభినందనలు:
ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ సతీష్ మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హృదయపూర్వకంగా అభినందించారు.

🔺ప్రజలకు సూచనలు🔺

మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకండి లేదా అమ్మకండి.
OTP, PIN, CVV వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.
తెలియని కాల్స్, లింక్స్, మెసేజెస్‌పై నమ్మకం పెట్టుకోకండి.
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్లను నమ్మకండి.
సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in⁠ లో ఫిర్యాదు నమోదు చేయండి.
సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమైనది.
మీ పేరుతో లేదా ఇతరుల పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మకండి.
తెలియని వ్యక్తుల నుండి Phonepe వంటి యాప్స్ ద్వారా డబ్బులు స్వీకరించవద్దు.
AEPS సేవలు అందించే వారు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి.
అధిక కమిషన్ ఆశతో అనుమానాస్పద లావాదేవీలు చేయడం వల్ల మీ అకౌంట్ హోల్డ్‌లో పడే అవకాశం ఉంది.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.