ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ యూనిట్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యునిగా ఆర్మూర్ రిటైర్డ్ ఎంఈవో మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సంఘ భవనంలో సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు.సభాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు కార్యదర్శి జ్ఞానేశ్వర్, ట్రెజరర్ నవజీవన్,గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి,జిల్లా కార్యదర్శి కరుణ సాగర్ రెడ్డి లు పాల్గొని మోహన్ రావును శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సభాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథి శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ మోహన్ రావు గతంలో హెడ్మాస్టర్ గా,ఎంఈవో గా, పీఆర్టీయు నాయకునిగా, రాజకీయ నాయకుల సన్నిహితుడిగా,ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎనలేని సేవలందించారని అభినందించారు.ఎప్పుడూ అందరితో కలుపుగోలుగా ఉండే మోహన్ రావు,సంఘ అభివృద్ధికి పాటుపడుతూనే ప్రభుత్వానికి వారధిగా కృషి చేస్తూ అపరిస్కృత సమస్యలు సాధించి పెడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సన్మాన గ్రహీత మోహన్ రావు మాట్లాడుతూ ఐకమత్యానికి మారుపేరుగా ఆర్మూర్ యూనిట్ తీర్చిదిద్ద బడిందని,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో సంఘ అభివృద్ధికి కృషి చేస్తూ రాష్ట్ర సంఘం తీసుకునే ఏ నిర్ణయాలకైనా నేను కట్టుబడి ఉంటానని,అందరిని కలుపుకొని వినూత్న కార్యక్రమాలకు చేయూతనందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు రాజశ్వర్ రెడ్డి, కార్యదర్శి జ్ఞానేశ్వర్, ట్రెజరర్ నవజీవన్, గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి,జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పుష్పకరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ గంగారెడ్డి,ఉపాధ్యక్షులు కోటేశ్వర్,సుధాకర్ కార్యదర్శులు గంగాధర్,హరి నారాయణ,జింధం నరహరి,జిల్లా కౌన్సిలర్స్ ఎం.సి ఓబన్న, భూమయ్య, దశరథ్, ఆడిటర్స్ ముత్తెన్న, సుదర్శన్,గేమ్స్ సెక్రెటరీ కరాటే భోజన్న ఆర్మూర్ యూనిట్ విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



