25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

కేంద్రం తప్పుడు కూతలపై ఎంపీ సురేష్ రెడ్డి గర్జన – కేంద్ర మంత్రి క్షమాపణకు డిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

కాలేశ్వరం ప్రాజెక్టుపై సభను తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కూసిన తప్పుడు కూతలపై సభకు క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో గర్జించారు. సభను తప్పుదోవ పట్టించిన మంత్రి క్షమాపణ చెప్పడంతో పాటు ఆయన మాటలు రికార్డులనుండి తొలగించాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి క్షమాపణ చెప్పకపోతే తాము సభా హక్కుల ఉల్లంఘన నోటీసిస్తామని అన్నారు.

ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను , కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటిని మెచ్చుకుంటూ సభలో కూర్చున్న ప్రతి ఒక్క కేంద్ర మంత్రి అవార్డులు ఇచ్చిన సంగతి మర్చిపోయి, దేశంలో ఆహార ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచిందని బడ్జెట్లో కేంద్రం చెప్పిందని సురేష్ రెడ్డి గుర్తు చేసారు.

సభా సాక్షిగా దేశానికి కాలేశ్వరం విషయము తెలియాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. కాలేశ్వరం ఒక ప్రాజెక్టు ఒక బ్యారేజ్ కాదని ఇందులో మూడు బ్యారేజీలు ఉన్నాయని 15 రిజర్వాయర్లు ఉన్నాయని, 15 వేల పైపులైన్లు, 25 టన్నెళ్లతో అనేక సబ్స్టేషన్ల్ నిర్మించబడ్డాయని సురేష్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని 34 వేల కోట్లు రాష్ట్ర సొంత బడ్జెట్ తో పాటు రుణాన్ని సేకరించి నిర్మించామని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లు కృంగినవని వీటి మరమ్మతుకు 300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని సురేష్ రెడ్డి అన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.