ఆర్మూర్ ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులో గల పద్మశాలి కన్వెన్షన్ గత ఎన్ని సంవత్సరాల తర్వాత పద్మశాలీలలో ఐక్యతను కూడగట్టుకుని షేర్/వాటా రూపంలో ఒక్కొక్కరు మా మీద నమ్మకంతో 50,000/- ఇన్వెస్ట్ చేస్తూ అందరం కలిసికట్టుగా కష్ట,నష్టాల్లో భాగస్వాములు కావాలని నిర్ణయించుకుని మమ్మల్ని నమ్మి ముందుకస్తున్న సందర్భంగా మొదటి నిర్మాణ కార్యక్రమం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, తలపెట్టి రాజమండ్రి ప్రముఖ పురోహితులు బాలాజీ సిద్ధాంతి, రాంనగర్ కు చెందిన ముత్తెన్న సంయుక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో అడాక్ కమిటీ సభ్యులు పాల్గొని,నిరాటంకంగా పనులు జరగాలని మార్కండేయుని ఆశీస్సులతో రాజకీయాలకు అతీతంగా అందరి ఆశీస్సులతో ప్రహరీ గోడ, డైనింగ్ హాల్, టాయిలెట్స్ పూర్తై, పెళ్లి వేడుకలు నిర్వహించేటట్లు పూర్తిస్థాయిలో కన్వెన్షన్ సంసిద్ధం కావాలని ఆకాంక్షిస్తూ శంకుస్థాపన,పూజా కార్యక్రమాన్ని కొబ్బరికాయలు కొట్టి దిగ్వజయంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అడాక్ కమిటీ సభ్యుల తరఫున బిజ్జు దత్తాద్రి మాట్లాడుతూ ఎవరేమనుకున్నా జరిగే పనులను ఎవరు ఆపలేరని ఈ పద్మశాలి కన్వెన్షన్ ను అందరి ఐకమత్యంతో అతి త్వరలోనే పూర్తి చేసి సామూహిక వివాహాలతో అతి గొప్ప ప్రారంభోత్సవ వేడుకను ఏర్పాటు చేస్తామని,కొందరు పనిగట్టుకొని తాము చేయరు ఇంకొకరిని చేయనివ్వరు.అని చందంగా ఆటంక పరుస్తారు.అందుకే ఇంతకాలం ఓపిక పట్టామని మేము చేసే కార్యక్రమం నిజాయితీగా నిబద్ధతతో ట్రాన్స్పరెంట్ గా నిర్వహిస్తున్నాము కాబట్టి మాకు ఎలాంటి అపోహలు,భయాలు లేవని దీన్ని మార్కండేయుడు, విగ్నేశ్వరుడు,భవాని మాత, ఆంజనేయ స్వామి దయతో అతి తొందరలోనే విజయవంతంగా పూర్తి అవుతుందని తన సత్ సంకల్పాన్ని తెలియజేశారు.


