24.7 C
Hyderabad
Thursday, August 13, 2026

ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా డాక్టర్ సుంకరి గంగామోహన్…. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం…. గౌరవాధ్యక్షుడు సాత్ పూతే శ్రీనివాస్…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా డాక్టర్ సుంకరి గంగామోహన్….
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం….
గౌరవాధ్యక్షుడు సాత్ పూతే శ్రీనివాస్…

ఆర్మూర్ పట్టణంలోని నవనాథపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు.అధ్యక్షులుగా డాక్టర్ సుంకరి గంగా మోహన్, ఉపాధ్యక్షులుగా శికారి శ్రీనివాస్, కార్యదర్శిగా మ్యాకల దినేష్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అజీజ్,కోశాధికారిగా తొగర్ల రాజేంధర్,గౌరవాధ్యక్షుడిగా సాత్ పూతే శ్రీనివాస్,సలహాదారులుగా మంచిర్యాల నరేంధర్,బారాడ్ గణేష్,సభ్యులుగా గట్ల వినోద్ గోజూరు మైపాల్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంగా మోహన్ మాట్లాడుతూ తమ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ అధ్యక్షులు సంజీవ్ తో పాటు సభ్యులందరి సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగుతామన్నారు.జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం కృషి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పూలమాలలలు, శాలువలతో ఘనంగా సన్మానించి,మిఠాయి తినిపించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఎన్నికల అధికారులుగా మంచిర్యాల నరేందర్,సాత్ పుతే శ్రీనివాస్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పార్థ్యం సంజీవ్, శ్రావణ్, కోడె మనోహర్,విన్సెంట్,వెంకటేశ్వర్ గుప్తా, సామ సురేష్, మోహన్ రెడ్డి,సూరిబాబు,చరణ్ గౌడ్, మహేష్ గటడి అశోక్,లిక్కి శ్రావణ్, రాంపూర్ శ్రావణ్, చిరంజీవి,ముఖేష్, నితీష్,గటడి అరుణ్, ముద్ర కోల వినోద్,గటడి రాజ్ కుమార్,పోహార్ కిరణ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.