Friday, May 22, 2026

నిజామాబాద్ జిల్లాలోని గంగపుత్ర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం…

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్మీడియట్,ఎంసెట్ వంటి ఉన్నత చదువులలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన గంగపుత్ర కులం కుటుంబానికి చెందిన పిల్లలకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ప్రతిభా పురస్కారాలను మన గంగపుత్రుల పిల్లలు ఉన్నత స్థాయిలో రావడానికి ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రతిభా పురస్కారాలలో ప్రశంసా పత్రం,జ్ఞాపిక అందజేశారు.ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న గంగపుత్ర ముద్దుబిడ్డలందరికీ పేరు పేరునా సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఆర్మూర్ కు చెందిన తొపారం రాజేశ్వర్ (రిటైర్డ్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం) వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రతిభా పురస్కార గ్రహీతలు, తల్లిదండ్రులు జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

అడిషనల్ డీసీపి శుభం ప్రకాష్ ను కలిసిన సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ...

More Articles Like This