26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

2027 జనాభా సేకరణలో కుటుంబ పెద్ద కు ప్రత్యేక ఐడి

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండలంలో రెండవ విడత జన గణన శిక్షణ ను చార్జ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రారంభించారు.పదహారేళ్ల తర్వాత మళ్లీ చేపట్టనున్న జనగణనకు ఎన్యుమేరేటర్స్ మరియు సూపర్వైజర్లకు రెండవ విడత శిక్షణ ఈరోజు నుంచి మూడు రోజులపాటు కొనసాగుతుందని, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు జనగణన కీలకమని అందులో  భాగంగా కేంద్ర హోంశాఖ ఇప్పటికే  నియమ నిబంధనలు రూపొందించింది.జనగణనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తి రెండో విడత శిక్షణ పూర్తి కానున్న తరుణంలో తదుపరి కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని . మే 11 నుంచి క్షేత్రస్థాయి సమాచార సేకరణ చేయనున్నారని అన్నారు.ఈ సందర్భంగా అడిషనల్ చార్జ్ ఆఫీసర్ మండల విద్యాశాఖగారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ మే11 నుంచి క్షేత్రస్థాయి సమాచార సేకరణజనగణన-2027 ప్రక్రియలో మే 11నుంచి తొలిదశ ప్రారంభం కానుంది. జూన్‌ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో సర్వేబాట పట్టనున్నారనీ. ఆయా గ్రామాల లో ఎన్ని గృహాలు ఉన్నాయో.. గుర్తించి, ప్రాంతాలవారీగా చిత్రపటాలను రూపొందించాలని . ఈ దశలో కుటుంబ పెద్దకు ఐడీ నీ కూడా క్రియేట్‌ చేయాలని ఈ ఐడీ కింద కుటుంబ జీవన స్థితిగతులను గుర్తించడం జరుగుతుందని . 2027 ఫిబ్రవరిలో రెండో దశలో జనగణన సర్వే చేపడతారు. ఈ రెండో దశలో మాత్రమే కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను నమోదుచేస్తారు. తొలి దశలో నివాస గృహం ఏ రకమైంది. వాహనాలు, ఆహారపు అలవాట్లతోపాటు 33 రకాల ప్రశ్నలు ఉండనున్నాయి. ఈ సర్వేలో శాటిలైట్‌ అనుసంధానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఎక్కడా పెన్నూ, పేపర్‌ వాడకుండా పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలోనే సేకరణ కొనసాగుతుందని సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లో ఈ సమాచారం నిక్షిప్తం చేయాలని ఆయన ఎన్ని మీటర్లకు సూపర్వైజర్లకు సూచించారు కార్యక్రమానికి ఫీల్డ్ ట్రైనర్స్ గా నరేందర్ మరియు రాజు వ్యవహరించారు .

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.