26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

జనగణన పగడ్బందీగా నిర్వహించాలి- తాసిల్దార్ శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ :బాల్కొండ మండలంలో జనగణన ప్రక్రియకు సంబంధించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 21 వరకు మూడు రోజుల పాటు బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది.ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి విడతగా 34 మంది ఎన్యుమరేటర్లు 4 సూపర్వైజర్లకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.జనగణన నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు, డేటా సేకరణ పద్ధతులు, సాంకేతిక అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా బాల్కొండ మండల చార్జ్ ఆఫీసర్ మరియు తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో కీలకమని తెలిపారు.అలాగే ఈ నెల 26 వ తేదీ నుంచి May 10వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు.

ప్రజల సహకారంతో గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఛార్జ్ ఆఫీసర్ మరియు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈసారి జన గణన పూర్తి డిజిటల్ తో కూడుకున్నదని జనగణనలో ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఫీల్డ్ ట్రైనర్స్ గా గజేందర్, మరియు బోయెడ నరసయ్యలు ఎన్యుమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.