Thursday, May 14, 2026

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99రోజుల మండల స్థాయి గ్రామ సభ

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం వేల్పూర్ మండలంలోని రైతు వేదిక వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మొదటగా తెలంగాణ గేయంతో మొదలుపెట్టి సీఎం రేవంత్ రెడ్డి సందేశం చదివి కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి బాలకిషన్ ప్రారంభించగా మండల స్పెషల్ ఆఫీసర్ భారతి అధ్యక్షత వహించారు.ఈ మండల స్థాయి సమావేశ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తాము నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి పనులు ప్రభుత్వ పథకాలు గురించి వివరించారు.తాహసిల్దార్ అనిరుద్ కొత్త రేషన్ కార్డు సన్న బియ్యం గురించి వివరించారు.అగ్రికల్చర్ ఆఫీసర్ రాజు రైతుబంధు, రైతు భరోసా గురించి వివరించారు.సమావేశానికి హాజరైన కొంతమంది రైతులు రైతుబంధు గురించి లబ్ధిదారులు మాట్లాడడం జరిగింది.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం వల్ల మాకు సొంత ఇల్లు కల నెరవేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నిరుపేదలకు అందుతున్నాయని నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల గ్రామ,సర్పంచులు మండల స్థాయి వివిధ శాఖల అధికారులు,పంచాయతీ సెక్రటరీలు వివిధ గ్రామాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.డిజిటల్ మీడియాలో తాజా వార్తలు అందించడానికి ఇప్పుడే చేరండి… నో యాడ్స్… నో టార్గెట్స్… నో సర్కులేషన్…👇👇👇👇👇https://subhodayam.news/join-reporter/

 

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This