26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

బాల్కొండ దత్త శబరి ఆశ్రమంలో సంకీర్తనలు, అన్నదానం

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ పట్టణంలోని నేషనల్ హైవే 44 పక్కన రైతు కళ్ళం వద్ద  ఉన్న  దత్త  శబరి ( తాడ్వాయి) ఆశ్రమంలో గురువారము భజన సంకీర్తనలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. గత రెండేళ్లుగా ఇక్కడ ప్రతి గురువారము భజనలు సంకీర్తనలు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా త్రాగుడు కు బానిసై మానలేని వారు అనేకమంది ఆశ్రమాన్ని సందర్శించి తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారని, జీవితంలో అనేక సమస్యలను గట్టెక్కడానికి ఆశ్రమాన్ని సందర్శిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సంకీర్తన కార్యక్రమంలో ఠాకూర్ రాము, అంజా గౌడ్, సాయ గౌడ్, సత్యనారాయణ గౌడ్, సుంకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.