Thursday, May 14, 2026

కిసాన్ నగర్ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న అనిల్, సునీల్

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ పరిధిలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణ రామ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించారు. పోటెత్తిన భక్తజనం

  • శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని కళ్లారా వీక్షించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TSMDC) చైర్మన్ ఈరవత్రి అనిల్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు 57 ఏళ్ల ఆధ్యాత్మిక ఈ సందర్భంగా టీఎస్‌ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ గత 57 ఏళ్లుగా ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోందని తెలిపారు.
Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This