వేల్పూర్ : వేల్పూర్ మండలం మోతే ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ భాగంగాలో పాఠశాలలో అందించే నాణ్యమైన విద్య,ఆట వస్తువులు అలాగే అదునాతన సదుపాయాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించడం తమ లక్ష్యం అని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శ్రద్ధ వహించి సెలవు రోజుల్లో కూడా కాన్వర్సింగ్ నిర్వహిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి పేద విద్యార్థికి ఉచిత నిర్బంధ విద్య అందించాలని కృషి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి, ఆగిల్టీ సంస్థ ఉద్యోగి అయిన మనోహర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ,హనీష్, రమేశ్, బాబాజీ,శ్రావ్య, సోనీ తల్లిదండ్రులు పాల్గొన్నారు..


