వేల్పూర్ :వేల్పూర్ మండలంలో ఎస్సెస్సీ ఫలితాలలో వేల్పూర్,మోతె, పచ్చలనడ్కుడ,కస్తూర్భా స్కూలు, కుకునూర్,వేల్పూర్ ఉర్దూ మీడియం,కృ ష్ణవేణి ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మండలంలో 432మందికి,424 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.వేల్పూర్ ఉన్నత పాఠశాలకు చెందిన విజ్ఞత రామన్నపేట్ విజ్ఞత 552 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. రామన్నపేట్ హైస్కూలుకు చెందిన రుతిక 544 మార్కులతో ద్వితీయస్థానంలో నిలిచింది.


