subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 7:46 pm Digital Edition : Jindham Narahari

భీంగల్ మండల కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు…

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భీంగల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు’మల్లెల.లక్ష్మణ్’ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీజీ చూపిన సత్యం,అహింస,శాంతి, స్వచ్ఛత మరియు సామాజిక సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ చేసిన సేవలను, ఆయన ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సమాజంలో శాంతి,ఐక్యత,సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్లు,మైనార్టీ అధ్యక్షులు,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పురానిపేట్ 4,5వ వర్డ్ – మెంబర్ డైడి.సురేష్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.