బాల్కొండలో మహాత్మా గాంధీ జయంతి
బాల్కొండ: బాల్కొండ మండల పట్టణ కేంద్రంలో ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. అనంతరం గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ అధ్యక్షులు కుందారపు శ్రీనివాస్ గాంధీజీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొహమ్మద్ యూనూస్, సంజయ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు గడ్డం రవి,మండల కార్యదర్శులు నల్లూరి హరికృష్ణ, పుప్పాల విద్యాసాగర్, పుల్లాయి నవీన్...