subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 10:43 am Digital Edition : Narendhar

బాల్కొండ లో అధికారుల ఇష్టారాజ్యంగా రెండు పడక గదుల పంపిణీ

బాల్కొండ :అధికారుల నిర్లక్ష్యంతో నిజమైన అర్హులకు రెండు పడకల ఇళ్లు అందలేదని బాల్కొండ మండలం కో ఆప్షన్ మాజీ సభ్యుడు ఏంఏ షాహిద్ ఆందోళన వ్యక్తం చేశారు.రెండు పడక గదులు పంపిణీ చేయడానికి వచ్చిన అధికారులకు ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బాల్కొండ గ్రామ పాలకవర్గము మరియు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదు అని ఎంత చెప్పినా వినకుండా తమ ఇష్టారాజ్యంగా బాల్కొండ తహసిల్దార్ వాళ్లు చేసుకున్న ఎంపిక దారుల పేర్లను మాత్రమే లక్కీ డ్రాలో వేసి లక్కీ డ్రా తీయడం జరిగిందని అసలైన అర్హులు నిరాశ వ్యక్తం చేస్తున్నారని మండల మాజి కో-ఆప్షన్ సభ్యులు ,షాహిద్ మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.