నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామ వాస్తవ్యులు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏ.ఆర్ కానిస్టేబుల్గావిధులునిర్వహిస్తున్నారు.ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మారథన్ రన్నింగ్ రేస్ పోటీలలో పాల్గొని, 21.5 కి. మీ దూరాన్ని 1.49 నిమిషాలలో గమ్యం చేరుకొని ప్రత్యేక ప్రతిభ కనబరిచి,గోల్డ్ మెడల్ సాధించాడు.తూర్పాటి సాయన్న వన్నెల్ (కే) ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యుడు కావడం విశేషం.ఈ సందర్భంగా వన్నెల్ (కే) ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు,గ్రామస్తులు మాట్లాడుతూ తూర్పాటి సాయన్న ఏ.ఆర్ కానిస్టేబుల్ గా రన్నింగ్ రేస్ లో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని గ్రామానికి డిపార్ట్మెంట్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.