బాలికల వసతి గృహాల్లో సుదీర్ఘ సేవలు.. పలువురి సంతాపం
మెదక్: మెదక్ మండల పరిధిలోని దూదిగాం, లక్షెట్టిపేట, మెదక్ ప్రాంతాల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాల్లో సీనియర్ వార్డెన్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన పి. ఇందిరా స్వరూప రాణి సోమవారం సాయంత్రం మృతి చెందారు.
బాలికల వసతి గృహాల్లో ఎన్నో సంవత్సరాల పాటు సేవలందిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ఆమె విశేషంగా కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల మెదక్ అధ్యక్ష మండల డయాసిస్ అధికారులు, వార్డెన్లు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్వరూప రాణి భౌతికకాయాన్ని సిద్దిపేటలోని సీఎస్‌ఐ చర్చ్ నుంచి సమాధుల తోట వరకు భారీ ర్యాలీగా తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక చర్చి పాస్టర్లు ఆంటోని, సాల్మన్ జయరాజ్, చరణ్, రాజు, వార్డెన్లు మేరీ పరంజ్యోతి, ప్రమీల అమృతరావు, సత్యవతి థామస్, దీవెన, ఇందిరతో పాటు పూర్వ విద్యార్థులు, చిన్ననాటి మిత్రులు, బంధువులు పాల్గొని స్వరూప రాణికి ఘనంగా నివాళులర్పించారు.
అలాగే స్థానిక సిద్దిపేట సీఎస్‌ఐ చర్చ్ సంఘం నాయకులు, స్త్రీల సమాజం సభ్యులు, స్థానిక కమిటీ సభ్యులు, డయాసిస్ అధికారులు, వార్డెన్లు తదితరులు పాల్గొని ఆమెకు నివాళులు అర్పించారు.