మెండోరా మండల ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ నూతన కమిటీల ఎన్నిక

మెండోరా:మెండోరా మండల కేంద్రంలోని మాదిగ కుల సంఘ భవనంలో మంగళవారం మండల మాదిగల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల నుంచి మాదిగలు, ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీనాయకులు, విద్యార్థులు, కుల సంఘాల పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి మెండోరా మండల ఇన్‌చార్జ్ మాకూరి మహేష్ మాదిగ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మసాయిపేట యాదగిరి మాదిగ హాజరై మాట్లాడారు. మాదిగల్లో ఐక్యత ఎంతో ముఖ్యమని, పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ మండల కమిటీలను ఏర్పాటు చేయడం అవసరమని అన్నారు. నూతన కమిటీల్లో విద్యార్థులు, విద్యావంతులు, సీనియర్ నాయకులకు తగిన...