బాల్కొండ :మన గోవులు, మన సంస్కృతి మరియు మన భవిష్యత్తు పట్ల సమాజంలో జ్ఞానం, అవగాహన, సేవా దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా “గో సేవా విభాగము – తెలంగాణ” ఆధ్వర్యంలో నిర్వహించిన గో విజ్ఞాన పరీక్షలకు అపూర్వ స్పందన లభించింది . పాఠశాల స్థాయి లో భాగంగా బాల్కొండ పి ఏం శ్రీ జెడ్పి హై స్కూల్ లో జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 200 మంది విద్యార్ధులు హాజరయ్యారు . ఈ కార్యక్రమములో హై స్కూల్ హెడ్మాస్టర్ రాజేశ్వర్ , బాల్కొండ ఖండ్ గో సేవా ప్రముఖ్ సల్ల నర్సయ్య లు పాల్గొన్నారు .