టీఎల్‌ఎస్‌ఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట నవీన్ కుమార్ నియామకం
బాల్కొండ: తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ (TLSA) సంస్థ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం మరియు సంస్థ లక్ష్యాల సాధన కోసం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాల్కొండకు చెందిన శ్రీ తోట నవీన్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు టీఎల్‌ఎస్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కె. బాలు నాయక్ , నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ జిల్ల నర్సాగౌడ్ లు సంయుక్తంగా నియామక పత్రాన్ని జారీ చేశారు. సంస్థ లక్ష్యాల సాధనలో పూర్తి సహకారం అందించాలని మరియు సమాజంలో విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. తోట నవీన్ కుమార్‌ను పలువురు అభినందించారు.