భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి సేవలు అభినందనీయం…

భద్రాచలం:మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు అందించిన సేవలు అభినందనీయమని పలువురు విద్యాశాఖ అధికారులు,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొనియాడారు.ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా భద్రాచలం మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జి.జాన్సన్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు చక్కటి పరిపాలన అందించారని,విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు.విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉపాధ్యాయులు,విద్యార్థులకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. మాజీ మండల విద్యాశాఖ అధికారి టి.రమ...