subhodayam.news
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 4:25 pm Digital Edition : Jindham Narahari

స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు…

నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామంలో పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సంఘ సభ్యులు చిత్రపటానికి పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ బూస విజయకుమార్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట యోధుడు,జాతీయ ఉద్యమ నాయకుడు,తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు చేనేత సహకార సంఘ వ్యవస్థాపకుడు,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వేడుకల సందర్భంగా బాపూజీని రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ జాతిపిత”గా,కేంద్ర ప్రభుత్వం “భారత రత్న”గా ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వన్నెల్ (కే) గ్రామ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు పోతుల రాజేశ్వర్,జింధం నారాయణ,జింధం నందు,సంబారు లక్ష్మినారాయణ,మాజీ సర్పంచ్ సామల గంగాసాగర్,చిల్వేరి శ్రీహరి,ఊరటి జయరాం,పోతుల ఎంబేరు, పోతుల పండరి,సంబారు శ్రీనివాస్,సామల నాగేష్,సంబారు గిరిధర్,జింధం అశోక్,చిల్వేరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.